ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన సమావేశం .. ఆంధ్రప్రదేశ్‌కు మంచి భవిష్యత్‌ను ఇస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రధానితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. మోదీతో ఎనిమిదేళ్ల తర్వాత సమావేశం అయ్యానన్నారు. ప్రధానితో సమావేశం గురించి రెండు్ రోజుల కిందట ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందన్నారు.
అరగంట సేపు మోదీ.. పవన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ దగ్గర నుంచి ఏపీలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కూడా ఇదే చెప్పారు. తాను ఏపీలో పరిస్థితుల్ని వివరించానన్నారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నానన్నారు. ఏపీ ప్రజలు బాగుండాలన్నదే మోదీ ఆకాంక్ష అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలి.. తెలుగు ప్రజలు బాగుండాలని పవన్ వ్యాఖ్యానించారు
మోదీతో మాట్లాడిన విషయాలపై పవన్ కల్యాణ్ క్లుప్తంగానే సమాచారం ఇచ్చారు. రాజకీయాలు మాట్లాడామని కానీ.. మరొకటి కానీ చెప్పలేదు. కానీ.. ఏపీకి మంచిభవిష్యత్ ఇస్తాయని చెప్పారంటే.. భవిష్యత్ రాజకీయాల గురించి చెప్పి ఉంటారని భావిస్తున్నారు. అలాగే ఏపీ అరాచక పాలన గురించి కూడా నోట్ ఇచ్చారని అంటున్నారు.