అల్లరి నరేష్ తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా కనిపించారు అల్లరి నరేష్. ట్రైలర్ లో అబ్బూరి రవి రాసిన డైలాగులు ప్రధానంగా వినిపించాయి.
”సాయం చేయమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకొని ప్రతి ఆఫీషర్లు సమాధానం చెప్పాలి”
”కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు”
”అన్యాయంగా బెదిరించే వాడికన్నా న్యాయం కోసం ఎదిరించే వాడే బలమైనవాడు”..
”పోలీసులు పంపిన, మిలటరీని పంపిన తలదించేదే లేదు”
‘మన దేశం బాగుపడాలంటే మార్పు రెండు చోట్ల మొదలవ్వాలి.. ఒకటి రాజకీయ నాయకులు, రెండు ప్రభుత్వ ఉద్యోగులు”
ట్రైలర్ లో వినిపించిన డైలాగులివి.
నదీ ప్రభావంలో జరిగే యాక్షన్ సీన్, అడవిలో ఎద్దులతో జరిగే ఫైట్ కూడా ట్రైలర్ లో ఆకర్షించింది. నరేష్ సీరియస్ రోల్ లో కనిపించారు. నాంది తర్వాత నరేష్ చేస్తున్న అదే సీరియస్ సినిమా ఇది. మారేడుమిల్లిలో జరిగే ఒక ఎన్నిక, దాని చుట్టూ వుండే రాజకీయంతో ఈ కథ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. నవంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.