ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా మందిని గుర్తించలేదు. ఎదుగుతున్న యువనేతల్ని గుర్తించకపోతే.. సరే అనుకోవచ్చు కానీ.. మోదీకి తాను సన్నిహితుడినని చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్న సోము వీర్రాజును కూడా గుర్తించకపోవడం అనూహ్యంగా మారింది. సమావేశం ప్రారంభంలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలని అందర్నీ కోరారు. అయితే సోము వీర్రాజు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. దీంతో మోదీ రెట్టించి అడిగారు.. సెల్ఫ్ ఇంట్రడ్యూస్ కరో అని అడగడంతో సోము వీర్రాజుకు కూడా లైట్ వెలిగింది. తనను గుర్తించలేదని అర్థం చేసుకుని వెంటనే పరిచయం చేసుకున్నారు.
అప్పుడే మోదీ.. మీరు ఏం చేస్తుంటారని ప్రశ్నించడంతో సోము మరింతగా అవాక్కయ్యారట. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడినని..ఆయన చెప్పుకున్నారు. అప్పుడు..నువ్వు నాకు నచ్చావ్ సినిమా ప్రకాష్ రాజ్ తరహాలో.. అది సరే.. బతకడానికి ఏం చేస్తావ్ అని ప్రశ్నించడంతో సోము వీర్రాజు నీళ్లు నమలాల్సి వచ్చింది. వ్యాపారాలు లాంటివేమీ లేవా అని అడగడంతో లేవని చెప్పాల్సి వచ్చింది.
మోదీ ఇలా ఎందుకు అడిగారో సోముకు అర్థంకాలేదు.. కానీ.. ఏమీ వ్యాపారాలు లేకపోయినా సోము వీర్రాజు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారన్న విపక్షాల ఆరోపణలు మాత్రం ఇప్పుడు నిజమయ్యే అవకాశఆలు కనిపిస్తున్నాయి. మోదీ ఇలా సోము వీర్రాజును గుర్తుపట్టకపోవడం.. కోర్ కమిటీ భేటీలోని ఇతర నేతలకు.., ముఖ్యంగా ఆయన వ్యతిరేకులను సంతోషపెట్టింది. వారే మీడియాకు ఈ వివరాలను లీక్ చేశారు. సోము వీర్రాజుకు ఈ మధ్య ఏదీ కలసి రావడం లేదు.