తాను దెబ్బతిన్నపులిలాంటి వాడినని.. అవినీతిపరుల అంతం చూస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న ఇళ్ల పేరుతో వేసిన లే ఔట్లను పరిశీలించారు. జగన్ శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా కనీసం గుంతలు కూడా తీయకపోవడంపై మమండిపడ్డారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క జనసేన మాత్రమే దోపిడిని ప్రశఅనిస్తోందన్నారు. జనసేనను నమ్మండి గూండాలను ప్రశ్నిస్తా. ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓట్లు వస్తాయో రావో తెలియదు కానీ మేము నామినేషన్లు వేస్తామన్నారు. మా నాయకుల నామినేషన్లు ఆపితే తాట తీస్తా కాళ్లు కీళ్లు విరిచి తాట తీస్తానని హెచ్చరించారు.
వైసీపీకి విజయనగరం నుంచి ఒకటే వార్నింగ్ మర్యాదగా మాట్లాడితే మాట్లాడండి ఎరా అంటే ఎరా అనే సమాధానం వస్తుంది. ఓడిపోయిన వాడ్ని, గాయపడ్డ వాడ్నినన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఏ సంక్షేమ పథకాలు నిలిపివేయమని పవన్ స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ కోరారు. వైసీపీ నేతల్లా తాను ప్రధానమంత్రికి చాడీలు చెప్పనన్నారు. రా బంగారు భవిష్యత్ కోసం జనసేనను గెలిపించాలన్నారు. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనపై పోరాటం కోసం వినియోగించాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు తాను సిద్ధమన్నారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ స్పష్టం చేశారు.
జగనన్న కాలనీ దోపిడియే రూ.12 వేల కోట్లు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుందన్నారు. జగనన్న కాలనీల దోపిడీపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తానన్నారు. యువతకు పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చానన్నారు. సొంత జేబుల్లో నుంచో బొత్స జోబుల్లో నుంచో మనకు డబ్బులు ఇవ్వడం లేదని, టాక్స్ రూపేణా మనం కడుతున్న డబ్బును వీళ్లు దోచుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీగా ఇస్తామన్నారు. 2024లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి, జనసేన రావాలి అనే నినాదం ఇచ్చారు పవన్.