టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. కరణం బలరాంకు కరణం వెంకటేష్ అనే కుమారుడు ఉన్నారు. ఆయనకు కుమార్తె ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, కరణం బలరాంలకు కలిపి ఓ ఆడపిల్ల జన్మించిందని గతంలో ప్రచారం జరిగింది. కానీ వారు ఎప్పుడూ బయటపడలేదు. తాజాగా.. తాను కరణం బలరాం, ప్రసూన బిడ్డనని.. తనకు అపాయం తలపెట్టేందుకు కరణం వెంకటేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. ఓ మహిళ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పేరు కరణం అంబికా కృష్ణ.
బల్కంపేటలో ఉండే కరణం అంబికాకృష్ణ ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించి రచ్చ రచ్చ చేశారు. అతన్ని పట్టుకుని ఆరా తీస్తే అతనిది ప్రకాశం జిల్లా అని తేలింది. కరణం వెంకటేష్ ముఖ్య అనుచరుడికి దగ్గర వ్యక్తి అన్న సమాచారం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కరణం అంబికాకృష్ణ. తన తండ్రి కరణం బలరాం అని.. అయితే కరణం వెంకటేష్‌తో తనకు వివాదాలున్నాయన్నారు. ఆయనపై దాడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇళ్లలోకే దుండగులు వస్తున్నాందున హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు.
కరణం వెంకటేష్ కు తనకు మధ్య ఉన్న విభేదాలు వల్ల నన్ను హత్య ప్రయత్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నావని పలుమార్లు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాననన్నారు. రాలేదు… కరణం వెంకటేష్ అనుచరుడైన త్రివేది పైన ప్రకాశం జిల్లాలో చీరాల డీఎస్పీ కి ఫిర్యాదు చేశాం. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. తాను గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామ వాస్తవ్యురాలిని అయినందున తరచూ పొన్నూరు – హైదరాబాదు కి ప్రయాణిస్తూ ఉంటానని ఇటువంటి పరిస్థితుల్లో ఏ క్షణాన ఏ ఘటన జరుగుతుందో అని భయభ్రాంతులకు గురి అవ్వవలసి వస్తుందని కరణం అంబికాకృష్ణ ఆదోళన వ్యక్తం చేశారు.
కరణం వెంకటేష్ అతని అనుచరుడైన త్రివేది నన్ను హత్యగావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాకు పూర్తిగా అనుమానంగా ఉన్నది.. గతంలో పలుమార్లు నాపై హత్య ప్రయత్నం జరిపారని..దీనిపై తక్షణమే స్పందించి పట్టుబడ్డ అగంతకుడు పై , వెంకటేష్ అనుచరుడుగా తిరుగుతున్నా మళ్లీపెద్ది త్రివేది పై ఎఫ్ఐఆర్ చేయాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కరణం బలరాం కానీ.. ఆయన కుమారుడు కానీ ఇంకా స్పందించలేదు.