విక్రమార్కుడు, రగడ, పటాస్ లాంటి కమర్షియల్ విజయాల కెమెరామెన్ సర్వేష్ మురారి మెగాఫోన్ పడుతున్నారు. అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీయం విడుదలకు సిద్ధమైయింది. కేవలం సభకు నమస్కారం అనే సినిమా మాత్రమే నరేష్ చేతిలో వుంది. అయితే ఈ సినిమా పనులు నత్తనడకనే సాగుతున్నాయి.
ఇప్పుడు కథలపై ద్రుష్టి పెట్టారు నరేష్. సర్వేష్ మురారి చెప్పిన కథ నరేష్ నచ్చింది. దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. నాంది సినిమా తర్వాత సీరియస్ కథలు చేస్తున్నారు నరేష్. మారేడుమిల్లి కూడా సీరియస్ కథే. అయితే సర్వేష్ మురారి మాత్రం ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నరేష్ కోసం రెడీ చేశారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.