ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఒకరినొకరు పలకరించుకున్నారు. మర్యాదపూర్వకంగా నమస్కరించుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోస్‌కు వచ్చిన జగన్.. కృష్ణకు పుష్పాంజలి ఘటించి సంతాపం ప్రకటించారు. అనంతరం, కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌ను ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు.
రాజకీయాలు పక్కన పెడితే వైయస్ జగన్ చిన్నప్పటి నుండి నందమూరి బాలకృష్ణ అభవిమాని. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడి గా ఉండే వారు. అదే విధంగా ఆయన పత్రికల్లోనూ తన అభిమానాన్ని చాటుకుంటూ ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చేవారు. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా 2000వ సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలా సందర్భాల్లో చర్చకు వస్తుంటుంది.