సూపర్‌స్టార్ కృష్ణ వెళ్ళిపోవడం మహేష్ బాబు కుటుంబానికి ఎవరూ పూడ్చలేని లోటు. సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి కోల్పోయిన మహేష్ బాబు.,. ఇప్పుడు కృష్ణ రూపంలో పెద్ద దిక్కుని కోల్పోయారు. కృష్ణది పెద్ద కుటుంబం. అందరినీ ఒకదగ్గరికి చేర్చి ఫ్యామిలీ టైం ని గడిపేవారు. ఎవరికి ఎన్ని పనులున్నా వీకెండ్స్ అందరూ ఒక్క చోట కూర్చుని భోజనం చేయాల్సిందే. ఫ్యామిలీ టైంని గడపాల్సిందే. ఇప్పుడు ఆయన లేరు. ఇక ఆ వీకెండ్ భోజనాలూ వుండవు.
మనవరాలు సితార ఆ క్షణాలని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయ్యింది. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘ఇకపై వీకెండ్ భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా’’ అని ఎమోషనలైయింది సితార.