లవ్యూ బంగారం అంటూ వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ హోయలు పోయిన ఆడియో వెలుగులోకి వచ్చింది. వైరల్ అయింది. ఈ ఆడియోను ఎవరు లీక్ చేస్తారు. చేస్తే అవంతి శ్రీనివాస్ చేయాలి. లేకపోతే.. ఆయన హోయలు పోయిన బంగారం చేసి ఉండాలి. అదీ కాకపోతే.. ఇంటలిజెన్స్ ట్యాపింగ్లో దొరికితే లీక్ చేసి అయినా ఉండాలి. ఈ మూడింటిలో ఏదీ కాకుండా బయటకు వచ్చే చాన్స్ లేదు.
అయితే పోలీసులు మంత్రి అవంతి ఫిర్యాదు చేశారు కదా అని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన యట్యూబర్కు నోటీసులు పంపారు. కోలా చంద్రశేఖర్ అనే వ్యక్తికి నోటీసులు పంపారు. విచారణకు రావాలని ఆదేశించారు. అతను వస్తాడో లేదో కానీ.. పోలీసుల తీరుపై మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మంత్రి అలా మాట్లాడటం తప్పా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. అది నిజమైనదే అయితే తనకు వచ్చిన ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయజం తప్పెలా అవుతుందని అంటున్నారు.
ఒక వేళ ఫేక్ అయితే.. ముందుగా ఆ ఆడియోను ఫేక్ అని ఫోరెన్సిక్ టెస్ట్ చేయించి.. దాన్ని క్రియేట్ చేయిన వారిపై కేసులు పెట్టాలి కానీ ఇదేం పని అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల ద్వారా.. అవంతి ఆడియోలు కరెక్టేనని.. లీక్ చేయడమే తప్పన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. ఆయన తీరు ఇప్పటికే వివాదాస్పదమవుతోంది. అవంతి మరీ ఇంత బలహీన మనస్కుడా.. ఎవర్నీ వదిిలి పెట్టడా అని ప్రశ్నిస్తున్నారు.