ఆంధ్రప్రదేశ్లో క్యాష్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ ఉండే వ్యాపారసంస్థలు ఏవి అంటే… అందరూ ముందుగా చెప్పే రెండే రెండు టాపిక్స్.. మద్యం దుకాణాలు, ఇసుక. ఆ మద్యం దుకాణాల ముందు ఉండే “స్టఫ్” అమ్ముకునే తోపుడు బండి వ్యాపారి కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు. మరి ఇలా వసూాలు చేస్తున్న క్యాష్ అంతా ఏమవుతోంది ? అనేది చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఇప్పుడు విమానాల ద్వారా తరలిపోయిందనడానికి క్లూలు బయటకు వచ్చాయి. ఇప్పుడీ వ్యవహారమే ఉన్నతాధికార… అవినీతి పరుల చర్చల్లో హాట్ టాపిక్.
ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానాల్లో తప్ప తిరగడం లేదు. వారి కోసం విజయవాడ ఎయిర్ పోర్టులో విమానాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. అవి ఎవరివి అంటే.. కనికా టేక్రివాల్ రెడ్డికి చెందిన జెస్ సెట్ గో కంపెనీవి. ఈ టేక్రివాల్ రెడ్డి.. అరబిందో ఫార్మా వారసుడు శరత్ చంద్రారెడ్డి రెండో భార్య. అంటే.. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యురాలన్నమాట. ఈమె నడుపుతున్న విమానాలతోనే ఎక్కడికక్కడ రాకపోకలు సాగిస్తున్నారు. చివరికి సీఎం జగన్ లండన్ వెళ్లిన విమానాన్ని కూడా ఈ సంస్థే సమకూర్చిందని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ విమానాలను బుక్ చేసుకున్న వారి పేర్లలో విచిత్రాలు బయట పడుతున్నాయి. ఎవరు బుక్ చేసుకున్నారో గుర్తించకుండా.. విజయ, సాయి, వీఎస్ రెడ్డి… వంటి వివిధ రకాల పేర్లతో విమానాలు బుక్ చేసుకుని తిరిగారు. ఆ విమానాల్లో ఏమి తీసుకెళ్లారన్నది ఇప్పుడు ఈడీ బయటకు లాగుతోంది. త్వరలో దీనికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది చిన్న నేరం కాదని.. ప్రధానమంత్రిని… ఇతరుల్ని రాజకీయ బలంతో కాకా పట్టి బయటపడవచ్చని అనుకోవడం అంత తేలిక కాదని అంచనా వేస్తున్నారు.
అసలు ఈ టేక్రివాల్ రెడ్డి తెలుగు వారు కాదు. ఆమె ఉత్తరాదికి చెందిన వారు. ఆమెకు ఇన్ని విమానాలు కొనడానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి..? అసలు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అన్నది కూడా ఈడీ విచారణలో తేలే అవకాశం ఉంది.