ట్విట్టర్ విషయంలో ఎలన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరుతో ఆ కంపెనీ సంక్షోభంలో పడింది. ఇక ట్విట్టర్ నడుస్తుందా లేదా అని ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణంగా ట్విట్టర్ ఉద్యోగులంతా సామూహికంగా సెలవు పెట్టడమే. ఏడున్నర వేల మంది ఉద్యోగులు ట్విట్టర్లో ఉంటే. మస్క్ ఆ కంపెనీని కొనేసిన రెండు వారాల్లోనే సగం మందిని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. మిగిలిన సగం మందితోనే అన్నీ పనులు చేయించాలని .. రకరకాల కండిషన్లు పెట్టాడు. సోషల్ మీడియాలో ట్విట్టర్ ఉద్యోగులు మస్క్ మీద ఏదైనా అభిప్రాయం చెబితే వెంటే.. యూ ఆర్ ఫైర్డ్ అని ట్విట్టర్లోనే పోస్ట్ చేసి.. వికటాట్టహాసం చేస్తున్నాడు.
ఈ పిచ్చి అంతకంతకూ పెరిగిపోతోందని.. భరించలేమని చెప్పి మిగతా సగం మంది సామూహికంగా సెలవు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి మస్క్‌కూ షాక్ తగిలినట్లయింది. వెంటనే తన ట్విట్టర్ అకౌంట్లలోనే డేంజర్ మార్క్‌ను పెట్టుకున్నాడు. తర్వాత ట్విట్టర్‌కు ట్విట్టర్ ఉద్యోగులే సమాధి కడుతున్నట్లుగా ఓ మీమ్‌ను పోస్ట్ చేశాడు. తర్వాత తాను ట్విట్టర్ కొన్ని రెండు రోజులకే తీసేసిన లిగ్మా జాన్సన్ అనే ఉద్యోగిని మళ్లీ చేర్కున్న అంశాన్ని గుర్తు చేస్తూ.. లిగ్మా జాన్సనే కాపాడాలని పోస్ట్ పెట్టాడు.
అయితే మస్క్ వ్యవహారంపై అత్యధిక మంది ట్విట్టర్ ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. రీ జాయిన్ అయ్యే ఆలోచనలో లేనట్లుగా తెలుస్తోంది. అతి కొద్ది మందితోనే ట్విట్టర్ నడుస్తోంది. ఇది ఎక్కువ కాలం నడకవపోవచ్చని.. టెక్నికల్ సమస్యలు వస్తే పరిష్కరించే వారు కూడా ఉండరని భావిస్తున్నారు. అందుకే ట్విట్టర్ ఎప్పుడైనా ఆగిపోవచ్చన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. ఉ్దదేశపూర్వకంగానే ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను చంపేస్తున్నాడన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.