బాలకృష్ణ ఆల్ టైమ్ హిట్స్ లో `ఆదిత్య 369` ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ఈ సినిమా సీక్వెల్ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బాలయ్యకూ ఆ ఆలోచన ఉంది. కానీ కార్యరూపం దాల్చడం లేదు. మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఏవి కుదర్లేదు. ఇక ఆదిత్య 999 ఉండదు… అనుకొంటున్న తరుణంలో.. బాలయ్య మళ్లీ ఆశలు చిగురించేలా చేశాడు.
ఆదిత్య 999 చేస్తానని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని విశ్వక్ సేన్ `దమ్కీ` ట్రైలర్ లాంచ్లో బాలయ్య కు మాట ఇచ్చేశాడు బాలయ్య. ఇది నిజంగా సినీ అభిమానులకు శుభవార్తే. కాకపోతే.. ఈ కథ బాలయ్య కోసం కాదని, ఇందులో బాలయ్య నటించడని విశ్వసనీయ వర్గాల టాక్. ఈ ప్రాజెక్టుని మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాగా మళ్లించే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. `ఆదిత్య 999`లో బాలయ్య కూడా ఉంటాడు కానీ, ఫోకస్ అంతా… మోక్షజ్ఞ మీదే అని తెలుస్తోంది. నటన – దర్శకత్వం ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేయడం బాలయ్యకు ఇష్టం లేదు. అందుకే ఈసారి కెప్టెన్ కుర్చీపై పరిమితం అవ్వాలనుకొంటున్నాడట. పైగా… మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎంతమంది దర్శకుల్ని పిలిపించి కథలు విన్నా బాలయ్యకు నచ్చడం లేదు. అందుకే… ఆదిత్య 999 కథని మోక్షజ్ఞతో లాగించాలని డిసైడ్ అయ్యాడని టాక్.