ఇలపావులూరి మరళీ మోహన్ రావు.. సోషల్ మీడియాలో రాజకీయాలను ఫాలో అయ్యే వారికి ఈయన బాగా తెలుసు. మంచి వాక్య నిర్మాణంతో.. తనకు ఇష్టమైన రాజకీయ పార్టీకి మద్దతుగా రాస్తూ ఉంటారు. ఏపీలో వైఎస్ఆర్సీపీకి.. తెలంగాణ టీఆర్ఎస్కు ఆయన బాగా రాత సేవలు అందిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఇష్టమైన పార్టీలకు మద్దతు ఇవ్వడం అంటే.. ఆ పార్టీలను పొగడటం కాదు.. ఆ పార్టీల ప్రత్యర్థుల్ని.. ప్రత్యర్థి పార్టీలను తిట్టడం. ఈ పనిని ఈ ఇలపావులూరి మరళీ మోహన్ రావు పక్కాగా.. చక్కగా చేసేవారు. అందుకే ఈయనకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎక్కువ వ్యతిరేకులున్నారు. అయితే అదిసోషల్ మీడియాలో విమర్శించడం వరకే.
కానీ ఆయన హఠాత్తుగా ఆదివారం కన్నుమూశారు. ఏ అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. పోస్ట్ కోవిడ్ ప్రభావం వల్లనేమో కానీ.. ఉదయం అంతా ప్రకాశం జిల్లా బీచ్లో ఉల్లాసంగా గడిపిన ఆయన రాత్రికి గుండెపోటుతో చనిపోయారు. ఆ విషయం బయటకు తెలిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆయన తన సంపతాపసందేశాన్ని అధికారికంగా విడుదల చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ఎవరూ పట్టించుకోలేదు. అసలు చనిపోయారని గుర్తు కూడా చేసుకోలేదు. ఎందుకు ఇలా చేశారా అని.. వైసీపీలోనే కొంత మంది చర్చించుకున్నారు.
వైఎస్ఆర్సీపీకి మద్దతుగా.. టీడీపీకి వ్యతిరేకంగా ఆయన గత ఎన్నికల సమయంలో ఎంత ఎక్కువగా కష్టపడ్డారో సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. వైసీపీ కుల విభజన వ్యూహాన్ని వ్యాప్తి చేయడంలో ఆయనదీ కీలక పాత్ర. ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నేతల దగ్గరకు వెళ్లి వారి గురించి కథనాలు రాసేవారు. అయితే ఆయన చనిపోతే.. ఎక్కువ మంది స్పందించలేదు. వైసీపీ అసలు స్పందించలేదు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్కు అనుకూలంగా ఎక్కువ రాస్తున్నారు. అందుకే స్పందించలేదేమో.., లేకపోతే..ఆయన రచనలకు డబ్బిచ్చి.. సెటిల్ చేసుకున్నారో కానీ.. ఇటీవల ఆయన వైఎస్ఆర్సీపీ గురించి రాయడం లేదు. అందుకే స్పందించలేదేమో స్పష్టత లేదు.
అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పార్టీ హైకమాండ్ పట్టించుకోదని గతం నుంచీ ఆరోపణలు ఇప్పుడు ఇలపావులూరి మరళీమోహన్ రావు విషయంలోనూ ఇలాగే జరగడం.. యాధృచ్చికమో.. మరొకటో కానీ.. తెలంగాణ సీఎం గుర్తించారని.. ఏపీ సీఎం మాత్రం మర్చిపోయారన్న అభిప్రాయం మాత్రం వైసీపీలోనే ఏర్పడుతోంది.