ట్విట్టర్ ను కొని దాన్ని రోడ్డున పడేస్తున్న ఎలన్ మస్క్‌కు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ట్విట్టర్ పరువును అడ్డంగా తీసేశాడు. ప్రత్యేకంగా పోల్ పెట్టి.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అని ఆయన అభిప్రాయసేకరణ చేశారు. పాజిటివ్‌గా ఫలితం వచ్చిదని.. ట్రంప్ ఖాతాను పనురుద్ధరిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం… అంత సీన్ లేదు.. తాను ట్విట్టర్లోకి వచ్చేది లేదని తేల్చేశారు. అప్పటికి మస్క్.. ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా కోసం అర్రులు చాస్తూంటారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.
ట్రంప్ .. మస్క్‌కు కృతజ్ఞతలు చెప్పారు కానీ.. తాను మళ్లీ ట్విట్టర్లోకి వచ్చేది లేదన్నారు. ఆయన ప్రారంభించిన ట్రూత్ సోషల్ అనే దానికే కట్టుబడి ఉంటానన్నారు. నిజానికి ఇప్పుడు ట్రంప్ మళ్లీ ట్విట్టర్లోకి వస్తే.. ఆయన ట్విట్టర్‌కు పోటీగా తను ప్రారంభించిన ట్రూత్ సోషల్‌కు తానే నెగెటివ్ ఇమేజ్ తెచ్చినట్లవుతుంది. అందుకే మస్క్ ఆఫర్‌ను ట్రంప్ నిరభ్యంతరంగా తోసిపుచ్చారు.
అయినా పాలసీలు మార్చకుండా.. ట్రంప్ ఖాతాను మస్క్ ఎలా పునరుద్ధరించారోనని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా వ్యవస్థ ప్రకారం జరగాలని.. మస్క్..తన ఇష్టానుసారంగా ట్విట్టర్‌ను నడుపుతున్నారని.. దీని వల్ల ట్విట్టర్ పై నమ్మకం లేకుండా పోతుందని అంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్…. మస్క్ వ్యవహారం లాఫింగ్ స్టాక్ అయిపోయింది. చివరికి ట్విట్టర్ కామెడీ పీస్‌గా మిగిలిపోయినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే. దాని విలువను మాస్క్నే దారుణంగా దారుణంగా తగ్గించేస్తున్నారు.