తేజ సినిమాలన్నీ ఫటాఫట్ రెడీ అవుతాయి. చాలా వేగంగా సినిమాలు తీస్తారాయన. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఏదో ఓ పేచీ వచ్చేస్తుంది. సరిగ్గా.. `అహింస`కీ అదే జరుగుతోంది. సురేష్‌బాబు తనయుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. రీషూట్లూ జరిగాయి. టీజర్ ఇప్పటికే వచ్చేసింది. కానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. చివరికి డిసెంబరు 23న ఈ సినిమాని విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. డిసెంబరు మొదటి వారం నుంచి ప్రమోషన్లు ప్రారంభించాలని చూస్తున్నారు.
అయితే అదే రోజున (డిసెంబరు 23న) రవితేజ పొంచి ఉన్నాడు. తన ధమాకా సినిమా ఆ రోజే విడుదల అవుతోంది. రవితేజ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగుంటాయి. మరి అలాంటి రోజు.. `అహింస` వస్తే.. పరిస్థితి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని రోజులు మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసిన సురేష్ బాబు …పోయి పోయి.. రవితేజతో పోటీ పడడం వెనుక ఏ లాజిక్కు ఉందో మరి..?!