ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. నిర్మలా సీతారామన్‌ను కలిసి.. ఇప్పటికిప్పుడు ఆర్బీఐ నుంచి అప్పులు ఇప్పించకపోతే.. జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేరమని మొర పెట్టుకోనున్నారు. ఆర్బీఐ నుంచి పర్మిషన్ ఇస్తే.. మంగళవారం బాండ్లు వేలం వేసి కాస్త ఆలస్యంగా అయినా జీతాలిచ్చుకుంటామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితి ఇప్పటికే ముగిసిపోయింది. ఇంకా చెప్పాలంటే రకరకాల పద్దులు చూపించి ఇంకా ఎక్కువ తీసుకున్నారు.
అందుకే కేంద్ర ఆర్థిక శాఖ అదనపు అప్పుల కోసం పర్మిషన్ ఇవ్వడం లేదు. ఓ వైపు తెలంగాణ సర్కార్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టింది. ఆ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ. ఇరవై వేల కోట్ల అప్పలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఏపీకి మాత్రం దాదాపుగా యాభై వేల కోట్లు అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాదు.. ఆర్బీఐ నుంచి తెచ్చుకునేలా సహకరించారు. ఇక ముందు తెలంగాణకు అప్పు ఇచ్చేఅవకాశం లేదు. కానీ ఏపీ మాత్రం ఇంకా అప్పుల కోసం వెంట పడుతోంది. ఇవ్వాలని బతిమాలుకుటోంది.
బీజేపీతో.. కేంద్రంతో.. వైసీపీ ఎప్పుడూ ఘర్షణాత్మక వైఖరికి వైసీపీ వెళ్లలేదు. ఇటీవల విశాఖ టూర్‌కు మోదీ వస్తే మొత్తం తమ మీద వేసుకున్నారు. సార్.. సార్.. అంటూ జగన్ ఏపీకి ఇచ్చే ప్రతీ పైసా అభివృద్ధికే వెచ్చిస్తామని చెప్పుకొచ్చారు. అయితే అప్పులకు అనుమతిలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రమూ చేయనంత అప్పును ఏపీ చేసేసింది. అయినా అదనపు అప్పులకు పర్మిషన్ ఇస్తే.. అది ఏపిని మరింతగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకునేలా చేయడం తప్ప మరొకటి కాదన్న వాదన వినిపిస్తోంది.