వైసీపీ నేతలు ఇటీవల వర్జినల్ లుక్‌తో కనిపిస్తున్నారు. ప్రవర్తన ఏది వర్జినలో.. ఏది నటనో చెప్పడం సాధ్యం కాదు కానీ.. బయట కనిపించే లుక్ మాత్రం వర్జినల్ లుక్‌లో కనిపిస్తున్నారు. అంటే జుట్టుకు రంగేసుకోవడం లేదు. అంబటి రాంబాబును అసలు గుర్తు పట్టడం కష్టం. ఆయన పూర్తిగా తెల్లజుట్టు, తెల్ల మీసంతో కనిపిస్తున్నారు. మల్లాది విష్ణు కూడా అంతే. గతంలో ఎప్పుడూ అలా కనిపించలేదు. మరి ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది చాలా మందికి వస్తున్న సందేహం. దీనికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ కొత్త పలుకులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేమిటంటే.. జగన్‌కు నలుపు అంటే ఇష్టం లేదట. అలా రంగేసుకుని ఆయనకు కనిపిస్తే కోపం వస్తుందన్న భయంతో వారు రంగేసుకోవడం మానేసారని అంటున్నారు.
ఇటీవల జగన్ సభలకు నలుపు దుస్తులతో వచ్చే వారిని రానివ్వడం లేదు. చున్నీలను కూడా తీసి వేయించి ఆ తర్వాత సభలోకి అనుమతి ఇస్తున్నారు. … చాలా చేశారు..ఇది కూడా ఓ విచిత్రమేనా అన్నట్లుగా అందరూ లైట్ తీసుకున్నారు. కానీ.. ఆ చున్నీలకు.. వైసీపీ నేతల జుట్టు రంగుకు ముడి పెట్టారు ఆర్కే. అయితే ఇది కాదని కూడా చెప్పలేం.. వైసీపీ అధినేత వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఆ పార్టీ నేతలు.. ముఖ్యంగా ఆయనతో దగ్గరగా ఉండే వారందరికీ తెలుసు.
ఈ వారం ఆర్టికల్‌లో ఆర్కే.. జగన్మోహన్ రెడ్డి గురించి కొత్తగా ఏమీ చెప్పలేదు కానీ.. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోందని… గ్రామాల్లోనూ ప్రజలు ఈసడించుకుంటున్నారన్న అభిప్రాయాన్ని బలంగా వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ నాయకులే అంటున్నారంటూ.. తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతగా చెప్పుకున్న బటన్ నొక్కడాన్ని బాద్యతగానే చేస్తున్నారని ఆర్కే అంగీకరించారు. క్రమం తప్పకుండా డబ్బులు వారి అకౌంట్లలో పడుతున్నాయన్నారు. అయితే ప్రజల అసంతృప్తి ఎందుకు బయటపడలేదంటే ఆయన టీడీపీ హయాం నాటి లాజిక్‌ను వివరించారు. బయట మాట్లాడటం లేదంటే.. అసంతృప్తి లేదని కాదని చెబుతున్నారు.
తెలంగామ రాజకీయాల్నీ ఆర్కే విశ్లేషించారు. ఈ సారి కేసీఆర్‌కు సుద్దులు చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ..ఆయన ఐటీ, సీబీఐ, ఈడీ అధికారులపై ఏసీబీ తో దాడులు చేయించి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పెట్టబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. నిజానికి అలా పెట్టవచ్చా అనేది చెప్పడం కష్టమే. ఎందుకంటే కేంద్ర ఉద్యోగులు..సీబీఐ పరిధిలో ఉంటారు.. రాష్ట్ర పరిధిలో ఉండరు. కానీ రాజకీయ కక్థ సాధింపుల్లో ఏదైనాసాధ్యమేనని ఆర్కే మాటలు నిరూపిస్తాయేమో చూడాలి.