ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మిత్రపక్షం అన్న పార్టీనే లేదు. ఆ పార్టీతో పెట్టుకోవడం కన్నా సైలెంట్ గా ఉండటమే మంచిదని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. వైసీపీ కూడా అంతే. కొంత మంది నాయకులకు తాయిలాలిచ్చి.. అప్పుడప్పుడూ పొగిడించుకుంటే చాలనుకుంటున్నారు. నేతలు..మేధావుల పేరుతో కొంత మంది పదవులు.. పనులు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. కానీ రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకం. వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఓ వైపు ఉన్నా.. కలిసి మెలిసి లేవు. ఏ పార్టీ దారిన ఆ పార్టీ వెళ్తున్నాయి.
ఏపీలో ఉన్న విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ వ్యతిరేకమే. వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై పోరాడాలని చంద్రబాబు అనుకుంటున్నారు. జనసేనను తీసుకు వచ్చారు. కానీ బీజేపీ , కాంగ్రెస్ రావడం కష్టం. ఎందుకంటే బీజేపీ పైకి విమర్శలు చేస్తున్నా… ప్రో వైసీపీ అనే ముద్ర ఉంది. తాము కరిగిపోయినా జగన్ ను నిలబెట్టాలన్నట్లుగా వారి తీరు ఉంటోంది. వామపక్షాలు పవన్, చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధంగానే ఉంటాయి.
ఏపీలో అందరి చూపు బీజేపీ వైపు ఉంది. ఆ పార్టీ గేమ్ ఛేంజర్ కాకపోవచ్చు కానీ.. చాలా వరకూ పరిస్థితుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ సపోర్ట్ అవసరం అని భావిస్తున్నారు. బీజేపీ కూడా జనసేన పార్టీ చీఫ్.. టీడీపీ అధినేత కలిసి మాట్లాడుకోవడంపై బీజేపీ చాలా నార్మల్‌గా స్పందించింది. అది పొత్తుల మ్యాటర్ కాదని లైట్ తీసుకుంది. తాము జనసేనకు అండగా ఉంటామని చెబుతూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని నెగెటివ్ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదు. మొత్తంగా వైసీపీకి అందరూ వ్యతిరేకమే. వైసీనీ నీడ పడినా నష్టపోతామని భయపడుతున్నారు.