ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు పరారవుతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా సరే చిత్ర, విచిత్ర వితండ వాదాలతో మంత్రులు తెర ముందుకు వస్తూనే ఉంటారు. అమరరాజా పెట్టుబడి తెలంగాణకు తరలి పోవడంపై.. మంత్రి అమర్నాథ్ సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సంస్థ వేధింపుల వల్ల పోలేదని .. తాము ఎవరిపైనా వేధింపులకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అమరరాజా ఇంకో చోట పెట్టుబడి పెట్టకూడదా అని ప్రశ్నించారు. అంతేనా పిల్లికి ఎలక సాక్ష్యంలాగా తన వాదననకు..చంద్రబాబు కుటుంబ కంపెనీ అయిన హెరిటెజ్ను తీసుకు వచ్చారు. హెరిటేజ్‌ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. హెరిటేజ్‌ను టార్గెట్ చేసి.. అమూల్‌ను తీసుకు వచ్చి.. ప్రజాధనాన్ని ఆ సంస్థకుక కట్టబెట్టి మరీ.. హెరిటేజ్ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేందుకు చేయాల్సిన పనులన్నీ చేశారు. ఎన్ని ఆరోపణలు చేయాలో ఆన్నీ చేశారు. చివరికి మజ్జిగ ప్యాకెట్లు సరఫరాను కూడా చిలువలు పలువలు చేశారు. ఎక్కడో రాజధానికి దూరంగా ప్లాంట్ కోసం ఎన్నికలకు ముందే స్థలం కొనుక్కుంటే దాన్నీ వివాదం చేశారు. హెరిటేజ్‌కు పాలు పోసే రైతుల్ని టార్గెట్ చేశారు. ఇంత చేసిన విషయం కళ్ల ముందు కనిపిస్తున్నా.. హెరిటేజ్‌ను వేధించామా అని చెప్పుకొస్తున్నారు.
ఇక పారిశ్రామికవేత్తలయిన ఏ టీడీపీ నేతనూ వదల్లేదు. పార్టీలో చేరిన వారి వ్యాపారాలు బాగున్నాయి.. మిగిలిన వారందరికీ.. ఒక్కటే చాయిస్ మిగిలింది.. వ్యాపారాలా.. వైసీపీ నా అని. వైసీపీ ఆఫర్‌ను కాదని టీడీపీలో ఉన్న వారికి రాజకీయమే మిగిలింది. వ్యాపారాల్లేవు. వైసీపీలో చేరిన వారికి వ్యాపారాలు మిగిలాయి. ఇంత దారుణమైన .. ప్రభుత్వ టెర్రరిజాన్ని చూపించిన ప్రభుత్వం.. మంత్రి అమర్నాథ్.. సమర్థించుకోవడానికి.. తాము ఏమీ చేయలేదని నిస్సంకోచంగా చెప్పుకుంటున్నారు.