మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రోజా తిరుపతిలో రాష్ట్రపతి పర్యటనలో పాల్గొన్నారు. ఎక్కడా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. జిల్లా మంత్రి స్వాగతం చెప్పాలి. పెద్దిరెడ్డి కూడా మంత్రే. అయినప్పటికీ ఇద్దరూ స్వాగతం చెప్పే వారిలో ఉండాలి. కానీ రోజాకు చాన్స్ రాలేదు.
తర్వాత కార్యక్రమంలో వేదికపై చోటు కూడా దక్కలేదు. మహిళా రాష్ట్రపతి వస్తే మహిళా మంత్రికి స్టేజ్‌పై చోటు దక్కలేదు. కింద ఆడియన్స్‌లో ఓ మూల కూర్చోవాల్సి వచ్చింది. కనీసం ఎక్కడా మాట్లాడే అవకాశం కూడా రాలేదు. తర్వాత రాష్ట్రపతికి వీడ్కోలు పలికే సమయంలోనూ ఆమె ఎయిర్ పోర్టులో కనిపించలేదు. అంటే పూర్తిగా అధికారులు కూడా ఆమెను పట్టించుకోలేదన్నమాట. ఇక్కడ ప్రోటోకాల్.. ఇతర వ్యవహారాలు అన్నీ.. రాష్ట్రపతి సిబ్బంది చూసుకుంటారు.. కానీ రాష్ట్ర అధికారులు ఇచ్చే లిస్ట్ కీలకం. ఆ లిస్ట్‌లో రోజాకు ప్రాధాన్యత దక్కలేదు. అందుకే ఆమె తీవ్ర అవమానానికి గురయ్యారు.
ఇంత దారుణమైన అవమానం రోజాకు జరగడంపై ఆమె అనుచరులు ఫీలవుతున్నారు. నగరి నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చినా గౌరవం లేకుండా చేస్తున్నారు. భర్తతో కలిసి వెళ్లి మరీ జగన్ దగ్గర మొర పెట్టుకున్నా.. రోజాకు.. రిలీఫ్ కలగలేదు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప.. రోజా చేయగలిగిందేమీ లేదని వైసీపీ వర్గాలు కూడా లైట్ తీసుకుంటున్నాయి.