డ్రగ్స్ అంటే నిన్నామొన్నటి దాకా అందరూ గోవా వైపు చూసేవారు. దానికి కారణం అది టూరిజం డెస్టినేషన్ కావడం. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌ను ఏపీ కొట్టేసింది. నిర్మలా సీతారామన్ విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియాలో ఏపీ ప్రధమ స్థానంలో ఉన్నట్లుగా తేలింది. స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన డ్రగ్సే 18,267 కిలోలు. ఇక దొరక్కుండా దాటిపోయింది లేకపోతే.. మార్కెట్లోకి అమ్మేసింది.. రాష్ట్ర యువత పీల్చేసింది ఎంతో చెప్పడం కష్టం. అంటే.. దేశంలోనే ఏపీ డ్రగ్స్ లో ఫస్ట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది.. కొంత మంది భయం..భయంగా.. చాలా మంది మత్తు మత్తుగా చూస్తున్నారు.
ఏపీలోనే ఇంత దొరికింది.. అసలు ఇతర రాష్ట్రాల్లో దొరికిన డ్రగ్స్ కూడా ఏపీ నుంచే వెళ్తాయి. గతంలో ఈ అంశంపై గగ్గోలు రేగింది. ఢిల్లీ వరకూ ఏపీ నుంచి గంజాయి తీసుకెళ్తున్న వాహనాలు పట్టుబడుతున్నాయి. ఏపీలో డ్రగ్స్ వ్యవహారాలపై డీఆర్ఐ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఏపీ నుంచి బయట రాష్ట్రాలకు వెళ్తున్నగంజాయి గురించి ముందుగానే సమాచారం అందుకున్న డీఆర్ఐ టీమ్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పట్టుకుంటోంది. ఏపీ నుంచే ఆ గంజాయి వస్తుందని దాదాపుగా అన్ని రాష్ట్రాల పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎవరు వ్యాపారం చేస్తున్నారో కూడా గుర్తించారు.
విశాఖ మన్యం ప్రాంతం నుంచి గంజాయి టన్నులు ,టన్నులు వస్తూ ఉంటుంది. పట్టుబడినవి పట్టుబడతాయి. .. లేనివి సరిహద్దులు దాటిపోతాయి. ఇదో పెద్ద మాపియాలా అయిపోయింది. కొన్ని వాహనాలనే పట్టుకుని.. పెద్ద పెద్ద గంజాయి లోడ్లను పోలీసులు వదిలేస్తారు. ఈ స్మగ్లింగ్ ఒక్క డ్రగ్స్‌కే పరిమితం కాలేదని.. ఎర్రచందనానిది కూడా సింహ భాగమేనని కేంద్రం తేల్చింది. మొత్తంగా ఏపీ .. దశ.. దిశను కొత్త ప్రభుత్వం వచ్చాక మార్చేశారు.