తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఒక దశలో తెలుగులో అగ్రశ్రేణి కథానాయిక తమన్నా. ఇక తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ప్రవేశించిన కాజల్, హన్సిక లాంటి హీరోయిన్ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో కూడా అడుగుపెట్టేశారు. తమన్నా పేరు కూడా పెళ్లి వార్తల్లో చాలా సార్లు వినిపించింది. ఆమె ఒక బిజినెస్ మాన్ తో ప్రేమలో వుందని, త్వరలో పెళ్లి కబురు చెబుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా మరోసారి తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది తమన్నా.” ప్రేక్షకులు, నా అభిమానులు నా పై చూపించే ప్రేమే నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా వుంది. నా కెరీర్, చేసిన పాత్రలు అభిమానులకు గర్వంగా చూపిస్తాను. అలాగే నేను చేసుకోబోయేవాడిని కూడా అంతే గర్వంగా ప్రకటిస్తాను. ఇందులో దాపరికం ఏమీ లేదు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు. ఇంట్లో కూడా వత్తిడి లేదు. చాలా సార్లు నా పెళ్లి పై వార్తలు రాశారు. అందులో వాస్తవం లేదు. ఏదైనా వుంటే నేనే చెబుతాను. ఇంత వయసులో పెళ్లి చేసుకోవాలనే టార్గెట్ ఏమీ లేదు. ఆ రోజు వచ్చినపుడు చాలా గర్వంగా ప్రకటిస్తాను” అని చెప్పుకొచ్చింది తమన్నా.