ఈ యేడాది చిత్రసీమని ప్రభావితం చేసిన టాప్ 10 స్టార్స్ జాబితాని IMDB ప్రకటించింది. ఈ లిస్టులో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్లకు స్థానం దక్కింది. చరణ్‌కి 4వ స్థానం, సమంత 5, ఎన్టీఆర్ 8వ స్థానం లభించాయి. బన్నీ 9వ స్థానంలో ఉన్నాడు. టాప్ 1 ఛైర్ ధనుష్ సొంతం చేసుకొన్నాడు. రెండో స్థానంలో అలియా భట్ ఉంది. కేజీఎఫ్‌తో దుమ్ము దులిపిన యష్ 10 వ స్థానంలో ఉన్నాడు.
ఆర్.ఆర్.ఆర్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. ఎన్టీఆర్, చరణ్… ఈ లిస్టులో చోటు దక్కించుకొన్నారు. సమంత ఈ యేడాదంతా.. ఫుల్ జోష్‌లో ఉంది. అందుకే తననీ IMDB గుర్తించింది. పుష్పతో బన్నీ హవా దేశమంతా కనిపించింది. అందుకే తను కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ధనుష్ ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్థార్. తన సినిమాలన్నీ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకొంటున్నాయి. సో.. తనకు టాప్ 1 దక్కడం వింతేం లేదు. కాకపోతే.. ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ల పేర్లు ఈ లిస్టులో లేకపోవడం ఆయా హీరోల అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.