చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలని పరిష్కరించడానికి నిర్మాతలు అంతా కలసి షూటింగ్ బంద్ కి పిలుపునిచ్చారు. దాదాపు ముఫ్ఫై రోజులు షూటింగులు నిలిపివేశారు. తాజాగా నిర్మాత కళ్యాణ్ ఈ షూటింగ్ బంద్ ని ఒక అట్టర్ ఫ్లాఫ్ షో గా అభివర్ణించారు. దిని వల్ల సమయం, డబ్బు వృధా తప్పితే ఎలాంటి మేలు జరగలేదని చెప్పుకొచ్చారు.
”చిన్న సినిమా నిర్మాతకు విడుదల రోజున చాలా సమస్యలు వున్నాయి. వీటికి పరిష్కారం దొరుకుతుందని షూటింగ్ బంద్ కి సమ్మతించాను. మొదటి నాలుగు మీటింగ్స్ లోనే దీంతో ఏం జరగదని అర్ధమైపోయింది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించారు. కానీ వాటి అమలు జరగలేదు. కొందరి వ్యక్తిగత లాభాల కోసం చేసుకున్న బంద్ అది” అని అభిప్రాయపడ్డారు సి కళ్యాణ్.