ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రశ్నించింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం వచ్చింది. ఈ సందర్భంగా ఎవరూ అటు వైపు రాకుండా కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. నిబంధల ప్రకారం… కవిత లాయర్ సమక్షంలోనే ప్రశ్నిస్తున్నారు. ఏం అడుగుతారు.. ఏం చెబుతారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వెలుగు చూస్తాయి కానీ.. నిజమేమిటో మాత్రం అంత తేలికగా బయటకు రాలేదు.
అయితే ఇలాంటి ఊహాగానాలు లేకుండా ఉండటానికి సీపీఐ నేత నారాయణ ఓ చిట్కా చెప్పారు. అదే డిమాండ్ లాగా వినిపించారు. అదేమింటే.. లైవ్ పెట్టారట. కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్న ఎపిసోడ్ మొత్తం లైవ్ పెట్టాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేస్తున్నారు. అది ఎందుకు సాధ్యం కాదని..సుప్రీంకోర్టు కార్యకలాపాలే లైవ్‌లో జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక వేళ లైవ్ పెట్టకపోతే రెండు వర్గాలు.. వేర్వేరు వాదనలతో ప్రచారం చేసుకుంటాయని దీని వల్ల లేనిపోని గందరగోళం తలెత్తుతుందని అంటున్నారు.
సీపీఐ నారాయణ డిమాండ్‌లో హేతబద్దత ఉన్నా.. ఇంతం వరకూ ఇలాంటి విరణ లైవ్ పెట్టాలనే డిమాండ్ ఎవరి నుంచీ రాలేదు. కానీ చాలా వరకూ పోలీసులు ఇలాంటి విచారణను వీడియో రికార్డింగ్ చేస్తారు. వాటిని సాక్ష్యాలుగా వినియోగించుకుంటారు. ఇప్పుడు కవిత విషయంలోనూ రికార్డింగ్ చేసి ఉంటారని భావిస్తున్నారు.