మెగా అభిమానులకు శుభవార్త. రామ్చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ వేదిక ట్వీట్ చేశారు. ‘హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమతో.. సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని’’ పోస్ట్ చేశారు.
రామ్ చరణ్-ఉపాసన 14 జూన్ 2012న వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది పదేళ్ళు కూడా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సినిమా షూటింగ్ దశలో వుంది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా విజయం అందుకున్న చరణ్.. శంకర సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఏఎ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
https://www.instagram.com/p/CmEAJpJJbp1/?igshid=YmRhOGE0MWQ=