సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. కీరవాణి తల్లి భానుమతి కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కీరవాణి తల్లి చాలాకాలంగా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు.
అయితే, మూడ్రోజుల కిందట ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాగా, భానుమతి భౌతికకాయాన్ని దర్శకుడు రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. తల్లి మృతితో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు కీరవాణి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు భానుమతి మృతికి సంతాపం తెలుపుతున్నారు.