తన మాజీ డ్రైవర్ను హత్య చేసిన అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన బుధవారం విడుదలయ్యారు. చార్జిషీట్ దాఖలు చేయకపోవడం వల్లనే బెయిల్ కు అర్హుడని న్యాయస్థానం బెయిల్ ఇస్తూ చెప్పింది. ఈ చార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేకపోయారు.. అంత క్లిష్టంగా కేసు ఉందా అనే అంశాల జోలికి వెళ్లలేదు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. అంతే.. పోలీసులు కూడా దర్యాప్తు చేయలేదు. ఎలాంటి పరిశోధన చేయలేదు. పైగా కోర్టుకు ఆయన పెద్ద బుద్దిమంతుడని రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ లెక్కలోకి రాలేదు. చివరికి విడుదలయ్యారు.
అనంతపురం చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యుల రోదనలు.. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తమ ప్రాణాలకు ముప్పు ఉందని… మథన పడుతూనే ఉన్నారు. అయినా ఆయన బ యటకు వచ్చారు. అదే సమయంలో జగన్ పై కోడికత్తి దాడి చేసిన శీను నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నారు. ఆయనకు కనీసం బెయిల్ ఇప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు సహకరించడం లేదు. జగన్ కు సానుభూతి తేవడం కోసమే తాను దాడి చేశానని.. తేల్చేశాడు శీను. ఈ విషయం పెద్దలకూ తెలుసు.
కేను ఎన్ఐఏకు ఇచ్చే వరకూ న్యాయపోరాటం చేసిన జగన్.. సీఎం అయ్యాక.. లైట్ తీసుకున్నారు. ఆ కేసు తేలకపోతే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు బెయిల్ కూడా ఇవ్వొద్దన్నట్లుగా ఉన్నారు. ఎన్ ఐఏ కేసులో బెయిల్ రావడం అసాధ్యం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేసును..బ దిలీ చేయాలని కోరాలని లేకపోతే.. నిందితుడిగా బెయిల్ ఇవ్వాలని సిఫారసు చేయాలని కోడికత్తి శీను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. కోడికత్తి శీను చిన్న గాయం చేసినా.. ఇంకా జైల్లోనే ఉన్నారు. అదే హత్య చేసినా.. అనంతబాబు దర్జాగా బయటకు వచ్చారు.
ఇక్కడ అసలు విషయం.. కోడికత్తి శీనుకు బెయిల్ రాకపోవడానికి ప్రభుత్వ సహకారం లేకపోవడం కారణం అయితే.. అనంతబాబుకు బెయిల్ రావడానికి పూర్తి సహకారం అందించడమే కారణం. మరి లోపం ఎక్కడుంది ?