చిత్రసీమలో ప్రేమ వ్యవహారాలకు కొదవ ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక హాట్ న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాకులు, దర్శకులతో హీరోయిన్లు చెట్టాపట్టాలేసుకొని తిరగడాలూ. చాలా కామన్. అయితే ఇప్పుడు ఓ విడ్డూరం జరిగింది. ఓ హీరోయిన్ లవ్ లో పడిపోయింది. ఇందులో కొత్తేముంది అనుకొంటున్నారా? ఆమె ప్రేమలో పడింది… హీరోతోనో, డైరెక్టర్ తోనో అయితే ఫర్వాలేదు. ఓ లేడీ టెక్నీషియన్ మాయలో.. ఆ హీరోయిన్ పడిపోయిందట. వీరిద్దరూ కలిసి… దాదాపుగా సహజీవనం చేస్తున్న రేంజ్లో కలిసిపోయారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ టెక్నీషియన్‌కి ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. ఆమెతో కలిసి ఈ హీరోయిన్ కొన్ని సినిమాలు పని చేసింది. ఆ రాపోతో.. ఇద్దరి మధ్యా… స్నేహం, ప్రేమ వగైరా వగైరా చిగురించాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ అవివాహితులే కావడంతో.. ఆ బంధానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయని టాకు నడుస్తోంది. సెట్లో వీరిద్దరినీ చూసి.. మిగిలిన వాళ్లంతా ముసి ముసిగా నవ్వుకొంటున్నారట. ‘విడ్డూరం కాకపోతే.. వీరిద్దరూ ప్రేమలో పడడం ఏమిటి?’ అని బుగ్గలు నొక్కుకొంటున్నార్ట. 2022 కదా.. ట్రెండ్ అలా నడుస్తోంది మరి!