పుష్ప కథ రాస్తున్నప్పుడు సుకుమార్‌కి రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన లేదు. నిడివి ఎక్కువవ్వడంతో… పార్ట్ 1, పార్ట్ 2లుగా విడగొట్టాడు. ఆ ప్రయత్నం ఫలించింది. పార్ట్ 1 సూపర్ హిట్టయ్యింది. పార్ట్ 2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. బిజినెస్ కూడా అదే రేంజ్లో జరగబోతోంది. సుకుమార్ మైండ్ లో ఇప్పుడు పార్ట్ 3 ఐడియా కూడా పుట్టేసింది. పార్ట్ 2 చివర్లో మూడో భాగానికి బీజం వేసేలా స్క్రిప్టు తయారు చేశాడట. పుష్ప తొలి భాగంలో ఓ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో చూపించారు. పార్ట్ 2లో.. అతని ఉచ్ఛస్థితి, పతనం రెండూ చూపించబోతున్నార్ట. తను జీరోకి పడిపోయి.. మళ్లీ హీరోగా ఎదగడమే పార్ట్ 3 కథ అని తెలుస్తోంది.
అయితే పుష్ప 3 ఇప్పుడే పట్టాలెక్కదు. దానికి కనీసం 5ఏళ్లు సమయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈలోగా సుకుమార్ మరో రెండు సినిమాలు పూర్తి చేయాలనుకొంటున్నాడని తెలుస్తోంది. బన్నీ కూడా మరో రెండు సినిమాలు ఫినిష్ చేస్తాడు. పుష్ప షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. రేపు అవతార్ 2తో పాటు పుష్ప గ్లిమ్స్ కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.