క్విడ్ ప్రో కో లాంటి వ్యవహారాలు చేయడంలో ఏపీ ప్రభుత్వ పెద్దల స్టైలే వేరు. కొంత మందికి ఇస్తున్న పదవులు చూస్తూంటే… ఇలాగే అనిపించక మానదు. రామ్ గోపాల్ వర్మతో తన బయోపిక్ ను వ్యూహం పేరుతో తీయిస్తున్న సీఎం జగన్..దానికి నిర్మాతగా ఉంటున్న దాసరి కిరణ్ కమార్‌కు.. గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంకా మూవీ ప్రి ప్రొడక్షన్ దశ దాటక ముందే… టీటీడీ పాలక మండలి సభ్యుడి గా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను నియమించారు. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.
టీటీడీ పాలకల మండలిలో ఇటీవల ఓ వైసీపీ నేత రాజీనామా చేశారు. లక్ష్మినారాయణ అనే ఆ వైసీపీ నేత హైదరాబాద్‌లో ప్రజల్ని వేల కోట్లకు ముంచారు. ఆయన అరెస్ట్ కావడంతో రాజీనామా చేయించారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఆ స్థానంలోకి కిరణ్ కుమార్ ను తీసుకున్నారు. ఈయన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కి దాసరి కిరణ్ సన్నిహితుడు. ఓ నాలుగు ఎవరికీ తెలియని సినిమాలు తీశారు. ఇప్పుడు జగన్ బయోపిక్ తీసేందుకు డబ్బులు పెట్టుబడి పెడతానని ముందుకు వచ్చారు. ఆయనకు ఓ గుర్తింపు ఇచ్చేశారు సీఎం జగన్.
వచ్చే ఎన్నికలకు ముందు రిలీజ్ చేసేలా.. వ్యూహం, శపథం పేరుతో ఆర్జీవీ రెండు సినిమాలు తీస్తున్నారు. తీసేది సీరియస్ సినిమాలు అయితే.. ఇటీవల పోర్న్ సినిమాలతో తనకు తాను పబ్లిసిటీ చేసుకుంటూ.. జగన్ బయోపిక్‌లపై నెగెటివ్ కామెంట్లు వచ్చేలా చేసుకుంటున్నారు. అయినప్పటికీ.. ఆర్జీవీపై ప్రభుత్వ పెద్దలు నమ్మకం పెట్టుకున్నారు. డబ్బులు పెడుతున్న నిర్మాతకు ముందస్తు పదవి ఇచ్చేశారు.