అన్ స్టాపబుల్ 2 మొత్తానికి ఓ క్రేజీ ఎపిసోడ్ రాబోతోంది. ప్రభాస్ – గోపీచంద్ లతో బాలయ్య చిట్ చాట్ చేయబోతున్నాడు. ఈ షో కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచీ ఎదురు చూస్తున్నారు. ఈరోజు.. ప్రోమో కూడా విడుదల చేశారు. నిజానికి ప్రభాస్ సిగ్గరి. పెద్దగా మాట్లాడడు. కానీ.. బాలయ్య మహత్యమో ఏమో…. ఈ షోలో.. ప్రభాస్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కువ సైటైర్లు ప్రభాస్ నుంచే పడ్డాయి. చాలా జోవియల్గానూ ఉన్నాడు. ఈ షోలో.. డైరెక్ట్‌గా చరణ్‌కి కాల్ చేశాడు ప్రభాస్. వారిద్దరి మధ్య జరిగిన బాతా ఖానీ.. ఈ షో మొత్తానికి హైలెట్ అయ్యింది. ‘చరణ్ నువ్వు నా ఫ్రెండువా శత్రువువా’ అంటూ.. ఫోన్లోనే సరదాగా కంప్లైంట్ చేశాడు ప్రభాస్. లవ్ మేటర్లు.. పెళ్లి విషయాలూ.. ఇలా చాలానే ఈ షోలో దొర్లాయి. గోపీచంద్ వచ్చాక అన్ స్టాపబుల్ ఎమోషనల్ టచ్ వైపు మళ్లిందనిపిస్తోంది. గోపీ చంద్ – ప్రభాస్ ల స్నేహం ఎలా మొదలైంది? ఒకరంటే ఒకరికి ఎందుకంత ఇష్టం? అనే విషయాలు ఈ షోలో ప్రస్తావనకు వచ్చాయి. ఓ ఫొటో చూపించి బాలయ్య.. కూపీ లాగడం, ప్రభాస్ ఆ ఫొటో గురించి చెప్పమని గోపీచంద్ ని బతిమాలాడడం.. ఈషోలో మరో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఆ ఫొటో ఎవరిదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేంత వరకూ ఆగాలి. చివర్లో… పెదనాన్న కృష్ణంరాజుని తలచుకొంటూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. `యాండే.. ఏదైనా మాట్లాడండీ.. ఓ పాట పాడండి` అంటూ.. బుజ్జిగాడులోని డైలాగ్ తో ప్రోమోకి ముగింపు పలికారు. ప్రోమో చూస్తే.. ఈ షో ఎప్పుడెప్పుడు చూద్దామా? అనేంత ఆసక్తి పెరిగిపోయింది. ఓ మాస్, మసాలా మల్టీస్టారర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ప్రోమో కలిగించింది.