సీనియర్లంతా తనపై కట్టు కట్టుకుని యుద్ధం ప్రకటించినా సరే టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను చేయాలనుకున్నది తాను చేస్తున్నారు. వాళ్లని అసలు పట్టించుకోవడ లేదు. వారెవరూ పీసీసీ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని డిసైడయినప్పటికీ.. తాను మాత్రం చేయాలనుకున్నది చేస్తున్నారు. జనవరి చివరి వారం నుంచి.. పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు దీనికి ‘సకల జనుల సంఘర్షణ’ అని పేరు పెట్టారు. ఐదు నెలల పాటు నిర్వీరామంగా పాదాయత్ర జరుగుతుంది.
రేవంత్ పాదయాత్ర చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ సీనియర్ నేతలు పదే పదే అడ్డు పడుతున్నారు. ఇంత కాలం ఓపికగా రేవంత్ ఎదురు చూశారు. ఇప్పుడు సీనియర్లంతా.. తాము రెబల్స్ మని ముద్ర వేసుకోవడంతో.. రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లయింది. ఇప్పుడు రేవంత్ మరింత ధైర్యంగా పాదయాత్రను ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పాదయాత్ర కొనసాగుతుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
పార్టీ హైకమాండ్ కు కూడా సీనియర్లపై నమ్మకం పూర్తిగా పోయింది. వారు కోవర్టులన్న ఓ నమ్మకానికి వచ్చేశారు. అందుకే వారిని పట్టించుకోవడం దాదాపుగా మానేశారు. రేవంత్ రెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రియాంకా గాంధీకి కూడా రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నట్లుగా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు పార్టీలో ఉండేవారు కాదని..వారు ఉన్నా.. సొంత సీటును కూడా గెలిపించుకోలేరన్న నిర్ణయానికి రావడంతో వారిని హైకమాండ్ ఇక లైట్ తీసుకుంటుందని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.