నాని చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో వుంది.గోదావరిఖని మైన్స్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. దసరాకి సంబధించిన ఒక స్పెషల్ అప్డేట్ తెలిసింది. ఇందులో ఎన్నికల ఎపిసోడ్ వుంది. నాని గ్రూప్ , ప్రత్యర్ధి గ్రూప్ ల మధ్య పోటాపోటీగా ఒక ఎలక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. గోదావరిఖని మైన్స్ నేపథ్యంలో ఈ ఎన్నికలు వుంటాయి. రామ్ చరణ్ రంగస్థలంలో ‘ఆ గట్టునుంటావా ? ‘అనే ఒక ఎన్నికల ప్రచారం పాట వుంది. దసరా కోసం కూడా ఇలాంటి ఒక ఎన్నికల ప్రచారం సాంగ్ ని కంపోజ్ చేశారని, అది బిట్ సాంగ్ గా వస్తుందని తెలుస్తోంది.
నాని గతంలో ఎన్నడూ చేయని మాస్ రోల్ ని ఇందులో చేస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లో ఆర్టిస్ట్ లు కొంతమంది అసలు నానిని గుర్తుపట్టలేకపోతున్నారని, అంతలా దసరా కోసం నాని మేకోవర్ అయ్యారని చెబుతున్నారు. నాని ఇప్పటివరకూ ఇంత మాస్ యాక్షన్ చేయాలేదని అంటున్నారు. ఇందులో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది.