గోపిచంద్ మలినేని సినిమాల్లో హీరో కాకుండా కొన్ని కీలక పాత్రలు వుంటాయి. ఆ పాత్రలు తీసుకునే మలుపు కథ, అందులో వుండే ఎమోషన్ కి ఎంతో కీలకం. క్రాక్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన జయమ్మ పాత్ర సినిమాకి హైలెట్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ పాత్రే సినిమా గ్రాఫ్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు బాలకృష్ణ తో చేస్తున్న వీరసింహా రెడ్డిలో కూడా వరలక్ష్మీ కోసం ఒక బలమైన పాత్ర రాసుకున్నాడు గోపిచంద్ మలినేని. కథలో ఈ పాత్రే కీలకం.
వరలక్ష్మీ పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ వర్క్ అవుట్ అయితేనే మిగతా కథలో ఎమోషన్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడని తెలుస్తోంది. వరలక్ష్మీ ఇది వరకూ చాలా పాత్రలు చేసింది. కానీ వీర సింహరెడ్డి లో పాత్ర ఆమెకు కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. వీరసింహలో వుండే కీ ఎమోషన్ అంతా ఆ పాత్రలోనే వుందని టాక్. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 సంక్రాంతికి విడుదల కానుంది.