వైసీపీలో ఓ స్థాయిలో ఉన్న నేతలకు ప్రతీ సారి ఏదో టాస్క్ వచ్చి పడుతోంది. గడప గడపకూ వెళ్లాలని సీఎం జగన్ బలవంతం చేస్తే వెళ్తున్నారు. కానీ అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. దీనికి చిట్కాగా ప్రతీ ఇంటికి కానుకలు పంచుతున్నారు కొంత మంది. ఇప్పుడు మరో టాస్క్ వచ్చి పడింది. అదే ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గృహసారధుల్ని నియమించడం జగన్ ఆదేశించారు… ఎమ్మెల్యేలు, ఇంచార్జులు పాటించాల్సిందే.
వైసీపీలో ఆడ్మినిస్ట్రేషన్ ఎప్పుడో ఐ ప్యాక్ చేతికి వెళ్లిపోయింది. ఐడియాలు ఇచ్చేది వాళ్లు.. అమలు చేయించేది వాళ్లే. అమలు చేయకపోతే.. జగన్ కు నెగెటివ్ రిపోర్టు ఇస్తామని బెదిరించేది కూడా వాళ్లే. దీంతో ఎమ్మెల్యేల పని దారుణంగా తయారైంది. ప్రతి ఒక్కరూ బెదిరించేవారు అంటూ.. ఇంటింటికి తిరుగుతున్నారు. ఇప్పుడు కార్యకర్తల ఇళ్లకు తిరగాల్సి వస్తోంది. వాలంటీర్ తరహాలో పార్టీ తరపున గృహసారధులుగా ఉండాలంటూ ద్వితీయ శ్రేణి నేతల్ని బతిమాలుతున్నారు. ఇలాంటి వారు అత్యధిక మంది.. ప్రభుత్వం వచ్చాక తమకు ఏ మాత్రం ఏ మేలు చేయలేదు . .. కనీసం పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ గుర్తొచ్చామా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.
గృహసారధులంతా.. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ఏర్పాటు చేసుకుంటున్న వ్యవస్థ అన్న ఓ ప్రచారాన్ని అంతర్గతంగా చేసుకుంటున్నారు. ఓటుకు పదిహేను నుంచి ఇరవై వేల వరకూ ఇచ్చే అవకాశం ఉందని.. అదంతా వీరి ద్వారానే పంపిణీ జరుగుతోందని ప్రచారం అచ్చేలా చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల గృహసారధులుగా ఉండటానికి వస్తారని… చివరిలో డబ్బుతో పని అంటే.. తమ రాజకీయం తాము చేసుకోవచ్చని వారు భావిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రజలు కూడా.. తమ ఓటు డబ్బుల విషయంలో ఈ గృహ సారధుల్నే ప్రశ్నింంచే చాన్స్ఉండటంతో… కొంత మంది అనుకున్నంతగా డబ్బులివ్వకపోతే తమపై దాడిచేస్తారేమోనని భయపడుతున్నారు.
వైసీపీలో అసలు సమస్యల కన్నా ఈతిబాధలు ఎక్కువైపోయాయని.. వరుస టాస్క్‌లతో నేతలు విరక్తి చెందుతున్నారు.. అయితే అదే సమయంలో వారు తమకు ఓ మంచి అవకాశం వచ్చిందని అనుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వాలంటీర్లు.. గ్రామ సచివాలయాలపైనా అనధికారిక పెత్తనం తీసుకోబోతున్నారు కాబట్టి…వారు తాము కోల్పోయినదంంతా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు. వారు ఏ మాత్రం తేడా చేసినా.. మొత్తం ప్రభుత్వానికి నెగెటివ్ అయిపోతుంది.