బిడ్డ చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో సగం వాటా అంబటి రాంబాబు అడిగారని.. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు నేరుగా ఆరోపిస్తున్నారు. కానీ అంబటి రాంబాబు మాత్రం దీనికి సమాధానం చెప్పకుండా రాజకీయంగా ఎదురుదాడి ప్రారంభించారు. పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో ఫలానా అని ఆరోపించారని.. అవి నిరూపించాలని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. పవన్ ఆరోపించిన విషయాన్ని పక్కన పెట్టి.. ముందు బాధితురాలు చేసిన ఆరోపణలపై అంబటి సూటిగా సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ అంబటి రాంబాబు ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టారుకానీ.. అసలు విషయం మాత్రం మాట్లాడలేదు.
అంబటి రాంబాబు తనపై వచ్చిన ఆరోపణలను క్లియర్ కట్ గా ఖండించుకోవడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. ప్రభుత్వంలో ఆయన మంత్రి. ఎలాంటి సమాచారం అయినా ఆయనకు క్షణాల్లో వస్తుంది. ఆరోపణలు చేసిన వారి బిడ్డ నిజంగానే చనిపోయాడా లేదా ? చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పరిహారం మంజూరు అయిందా లేదా ? మంజూరు అయిన చెక్కు వాళ్ల చేతికి వెళ్లిందా లేదా ? అనేది రికార్డులతో సహా అందరి ముందు పెట్టవచ్చు. ఒక వేళ చెక్కు వారికి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో కూడా అంబటి రాంబాబాబు చెప్పాల్సి ఉంటుంది.
ఇక్కడ చెక్కు వచ్చింది. కానీ.. ఇంత వరకూ బాధితులకు ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది. అంటే లంచంగా ఇవ్వాల్సిన రెండున్నర లక్షల రూపాయలు ఇస్తేనే చెక్కు ఇస్తామని బేరం పెట్టుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ ఏమీ తెలియనట్లుగా అంబటి రాంబాబు ఈ ఇష్యూపై చాలా తక్కువగా మాట్లాడి.. రైతుల పరిహారం గురించి మాత్రంచాలా ఎక్కువగా మాట్లాడారు. అసలు ఈ ఆరోపణల్లో రైతుల మ్యాటర్ లేదు. కానీ.. రాంబాబు మాత్రం దానిపైనే మాట్లాడారు.
అంబటి రాంబాబు తప్పు చేశారని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఆయన నిస్సిగ్గుగా సమర్థించుకోడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా అంబటి విషయంలో సీరియస్ గా వ్యవహరించకపోతే.. పోయేది ప్రభుత్వం పరువే.