తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తోంది. ఈ వ్యవహారంపై అందర్నీ కూల్ చేసేందుకు దిగ్విజయ్ సింగ్‌ను నియమించారు. దాంతో ఆయన పలువురు సీనియర్లకు పోన్ చేసి.. తొందరపడవద్దని సూచించినట్లుగా చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. అందుకే మంగళవారం నిర్వహించాలనుకున్న సభను వాయిదా వేశామని నేతలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తొమ్మిది మంది సీనియర్ నేతల్లో కొంతమంది బీజేపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ సీరియస్ గా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న దిగ్విజయ్ సింగ్.. సీనియర్ల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయనున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంజి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు . అయితే ఒక్కక్కరుగా కాకుంా.. అందరు సీనియర్లు ఒకేసారి తెరపైకి వచ్చారు.
వీరంతా వ్యూహాత్మకంగా ఓ పార్టీతో మాట్లాడుకుని …ఇలా రచ్చ చేస్తున్నరని.. వీరంతా కోవర్టులన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే .. ఈ మేరకు వస్తున్న సోషల్ మీడియా పోస్టులపైనా రేవంత్ వర్గం నేతలు దృష్టి పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేదని..ఎవరైనా పెడితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు సీనియర్ నేతలు.. బుజ్జగింపులకు తగ్గాలా.. తమ నిర్ణయం తాము తీసుకోవాలా అన్నదానపై డైలమాలో ఉన్నారు.