మీ ఇంట్లో వివాహేతర బంధాలు ఎంత మందికి ఉన్నాయి ? ఎంత మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు ? అంటూ… వాలాంటీర్లు ఇంటింటికి వచ్చి ఆరా తీస్తున్నారు. సచివాలయంలో ఉండే మహిళా పోలీసులకు .. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఈ బాధ్యతలే ఇచ్చారు. వారు వాలంటీర్లను తీసుకుని ఇంటికంటికి వెళ్తున్నారు. అక్రమ సంబంధాలు, లైంగిక సంబంధాలు, వీటికి సంబంధించిన నేరాలు.. ఇలాంటి వివరాలను ఓ ప్రత్యేక ప్రోఫార్మాలో తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వివరాలు అడిగినప్పుడు చాలా మంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వాలంటీర్లు అ ప్రోఫార్మా ప్రకారం రాసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు.
నిజానికి ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే… ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ల వంటి వివరాలు సేకరించడమే తప్పు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజల ప్యూర్ పర్సనల్ వివరాలు సేకరిస్తున్నారు. చివరికి లైంగి సంబంధాల వివరాలూ సేకరిస్తున్నారు. ఇది సంచలనం అవుతోంది. వాలంటీర్లు, మహిళా పోలీసుల తీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ముందు ముందు ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారన్న అనుమానాలు, భయాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి.
గ్రామ మహిళా పోలీసులు, వాలంటీర్లకు అలాంటి వివరాలు ఎవరూ చెప్పరు. కానీ.. వారికి సమాచారం ప్రకారం రాసేస్తున్నారు. ప్రోఫార్మా ప్రకారం వివరాలు పంపుతున్నారు. ఇది కూడా అనేక వివాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తి స్థాయిలో వాలంటీర్లు తమ వద్ద ఉంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిగత వివరాలనూ సేకరించి.. ప్రజల్ని మరింత ఆభద్రతకు గురి చేస్తున్నారు.