పవన్ కల్యాణ్ పేరెత్తడానికి భయపడే.. ‘సాక్షి’ ఇప్పుడో.. అడ్డమైన పోలిక వెదుక్కుంది. పవన్ తో.. విశాల్ కి విచిత్రమైన ముడి పెట్టింది. పవన్ కి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్… విశాల్ తో పోల్చింది. వీరిద్దరూ ఒక్కటే నట. క్రేజ్‌లోనూ.. అభిమాన గణంలోనూ. అంతే కాదు… విశాల్ ని చూసి నేర్చుకోమని పవన్ కి సలహా ఇచ్చింది.. సాచ్చి.
లాఠీ ప్రమోషన్లలో భాగంగా.. రాజకీయాల ప్రస్తావన వచ్చింది. దీనిపై విశాల్ మాట్లాడాడు. సామాజిక సేవ చేయాలంటే, రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదని, హీరోగానూ చేయొచ్చని చెప్పాడు. ప్రస్తుతం హీరోగా తన కెరీర్ బాగుందని, బాగా సంపాదిస్తున్నానని అలాంటప్పుడు.. రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా చేసేదేముందని అన్నాడు విశాల్. రాజకీయాలపై ఇది విశాల్ సొంత ఆలోచన.. అభిప్రాయం. దాన్ని తీసుకొచ్చి.. పవన్ తో ముడి పెట్టింది సాక్షి.
పవన్ కూడా విశాల్ లా ఆలోచిస్తే బాగుండేదని, రాజకీయాల్లోకి రాకుండా సినిమాలు చేసుకోవాల్సిందని పిచ్చి లాజిక్ తీసింది. ఎం.ఎల్.ఏ కంటే హీరోగా ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చేసేదేముందని ఓ బోడి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే.. ఎం.ఎల్.ఏ అయ్యేది సంపాదించడానికా..? ఇదేం లాజిక్కో అర్థం కాదు. అసలు.. పవన్. విశాల్ ఇద్దరి క్రేజ్ ఒక్కటే అని సాక్షి ఎలా బేరీజు వేసిందో అంతు చిక్కడం లేదు. పవన్ స్టామినా, స్థాయి ఏమిటో? తెలుగు ప్రజలందరికీ తెలుసు. హీరోగా విశాల్ మైలేజీ ఏమిటో ప్రపంచానికి తెలుసు. విశాల్ ఇప్పటి వరకూ చేసిన సినిమాల కలక్షన్లు.. పవన్ ఒక్క సినిమా వసూళ్లతో సరిపోల్చలేం. అలాంటిది ఇద్దరికీ ఎలా ముడి వేశాడో? విశాల్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి.. పవన్ కూడా దూరంగా ఉండాలా? సినిమా వాళ్లు సినిమాలే చేసుకోవాలా? రాజకీయాలు చేయకూడదా? పవన్‌పై సాక్షికి కోపం ఉండొచ్చు. కానీ అడ్డదిడ్డంగా,లాజిక్ లేకుండా మాట్లాడితే… అభాసుపాలవ్వడం ఖాయం.