ఇతరులను మోసం చేస్తే బాగుపడతావేమో కానీ.. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనాకిపోతావ్ అని.. ఓ సినిమాలో డైలగ్ ఉంటుంది. సంక్షేమం విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ఇదే కొటేషన్ వర్తించేలా ఉంది. అపరిమితంగా సంక్షేమం ఇస్తున్నామని.. వేల కోట్లు.. లక్షల కోట్లు పంచేస్తున్నామని చెప్పుకుంటోంది కానీ.. రాను రాను సంక్షేమ బాధితులు పెరిగిపోతున్నారు. అన్నీ చోట్లా కోతలే కనిపిస్తున్నాయి.
మాచర్ల పట్టణంలో ఆరు వేల మందికి వివిధ రకాల పెన్షన్లు వస్తూంటాయి. హఠాత్తుగా ఆరు వందల మందికి రద్దు చేసేశారు. అంటే పది శాతం. ఎందుకంటే.. రేపు ఒకటో తేదీ నుంచి ఒక్కొక్కరికి 250 పెంచుతున్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్. ఉన్న డబ్బులనే పంచాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పించన్లు లేపేసి.. ఆ డబ్బులను పెంచి ఉన్న వారికిఇస్తున్నారు. దీంతో ఆ వృద్ధులు లబోదిబోమంటున్నారు. మాచర్లలో అయితే.. ప్రత్యేక కౌంటర్ పెట్టి విజ్ఞాపనులు తీసుకున్నారు. ఇలా రాష్ట్రమంతాఉంది.
ఇలా చేయడం.. సంక్షేమ రాజ్యమైన ప్రభుత్వం.. తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. ఇదొక్కటే కాదు..ప్రతీ పథకంలోనూ అంతే. ఇప్పటికే పథకాలు ఆగిపోతున్నాయి. కొన్ని పథకాలకు మీట నొక్కడం మర్చిపోతున్నారు. మరికొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఈ ఏడాది ఇంత వరకూ ఇవ్వలేదు. మీట నొక్కేది.. ప్రచారం చేసుకునేది.. ఈ ఏడాదికనిచెబుతారు.. కానీ అవి గత ఏడాదివి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం సంక్షేమం విషయంలో ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేస్తోంది.
ఇలా సంక్షేమాన్ని ఫార్సుగా మార్చడం అంటే.. తమను తాము మోసం చేసుకోవడమే. అలా చేయడం తమ నెత్తి మీద తాము పెట్టుకోవడమే. ప్రభుత్వ పెద్దలు గుర్తిస్తారో లేదో మరి !