గుడివాడలో కొడాలి నాని కొన్నాళ్లుగా కాపుల మద్దతును కూడా పొందుతున్నారు. దీనికి కారణం వంగవీటి రాధా. గుడివాడలో కమ్మ సాజికవర్గంతో పాటు కాపులు కూడా గణనీయంగా ఉన్నారు. వారి మద్దతే ఎన్నికల్లో కీలకం. అందూలోనూ అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది వంగవీటి రంగా అభిమానులు. రాధా అనుచరులు. కొడాలి నాని.. వంగవీటి రాధాను తన స్నేహితుడుగా ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఏదైనా శుభకార్యాలకు వంగవీటి రాధా వస్తున్నారని తెలిస్తే తాను కూడా రాధా వచ్చే సమయానికే వెళ్లి ఫ్రెండ్ షిప్ ముసుగులో ముచ్చట్లు చెప్పి.. మీడియాకు.. లీకులిస్తారు. ఇది వంగవీటి రాధాకకు తెలిసినా స్నేహాన్ని ఇలా వాడుకుంటున్నారని తెలిసినా సైలెంట్ గా ఉంటున్నారు.
గత ఎన్నికల్లో వంగవీటి రాధా టీడీపీ తరపున ప్రచారం చేసినప్పటికీ.. గుడివాడ విషయంలో మాత్రంమ సైలెంట్ గా ఉన్నారు. అక్కడ దేవినేని అవినాష్ టీడీపీ తరపున పోటీ చేయడం ఓ కారణం అయితే.. కొడాలి మిత్రుడు కావడం మరో కారణం. ఈ సారి మాత్రం గుడివాడలో ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మధ్య వంగవీటి రాధా వరుసగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించడంతో టీడీపీ తరపున గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ జరిగింది. అయితే ఈ ఈ విషయంపై క్లారిటీ రాలేదు. టీడీపీ తరపున రాము అనే ఎన్నారై పోటీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆయన గుడివాడలో హడావుడి చేస్తున్నారు. మరో వైపు రావి వెంకటేశ్వరరావు కూడా పోటీ చేయాలనే తలంపుతో ఉన్నారు. ఆయన కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్య రావి వెంకటేశ్వరరావు కొంత మంది పెద్ద మనుషులతో వంగవీటి రాధాతో చర్చలు జరిపి.. తనకు మద్దతు ఇచ్చేలా చేసుకున్నారని అంటున్నారు. స్నేహం వేరు,రాజకీయం వేరు అన్న కోణంలో రాజకీయంగా కొడాలి నానికి వ్యతిరేకంగా పని చేయాలని.. ఓడించేందుకు సహకరించాలని రావి వెంకటేశ్వరరావు కోరినట్లుగా చెబుతున్నారు. దీనికి వంగవీటి రాధా కూడా అంగీకరించారని చెబుతున్నారు. అందుకే ఇటీవల రాధా-రంగా మిత్రమండలి కార్యకలాపాలు గుడివాడలో పెరిగాయి. కొడాలి నానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సారి వంగవీటి మద్దతు పరోక్షంగా అయినా లేకపోతే కొడాలినానికి చిక్కులు తప్పకపోవచ్చు.