స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సరైనోడు రిలీజ్ అవుతున్న ఈ సందర్భంగా తన తర్వాత సినిమాల ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే బన్ని లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా ఏర్పాటు చేస్తుండగా మరో తమిళ సినిమా మీద బన్ని కన్ను పడ్డదట. అధర్వ, కేథరిన్ కలిసి నటించిన కనిథన్ రీమేక్ కు బన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 26న కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టి.ఎన్.సంతోష్ దర్శకత్వం చేయగా.. ఎస్.థను నిర్మించారు.
బోయపాటు శ్రీను డైరక్షన్ లో చేస్తున్న సరైనోడు ఏప్రిల్ 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి కనిథన్ సినిమా తెలుగులో ఎవరు దర్శకత్వం చేయనున్నారు.. సినిమాలో బన్నితో సరసన ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. రీమేక్ ల హవా కొనసాగిస్తున్న మెగా హీరోల నుండి మరో సూపర్ హిట్ సినిమా రీమేక్ అవ్వడం మెగా అభిమానులంతా ఉత్సాహంగా ఉన్నారు. మరి కనిథన్ సినిమా మీద మనసు పడ్డ బన్నికి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.