ఈ సంక్రాంతి వస్తున్న ‘వీర సింహారెడ్డి’ యాక్షన్ సినిమా అయితే… ‘వాల్తేరు వీరయ్య’ మాస్ ఎంటర్టైనర్. వీటి మధ్య వస్తున్న ‘వారసుడు’ది మాత్రం ఫ్యామిలీ మార్కు సినిమా. విజయ్‌కి మాస్ల మంచి ఫాలోయింగ్ ఉంది. తనదంతా మాస్ బాణీనే. అయితే… ఈసారి మాత్రం క్లాస్ టచ్‌తో కూడుకున్న కథ ఎంచుకొన్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ‘వారసుడు’లో బ్రదర్ సెంటిమెంట్ గట్టిగా దట్టించారని సమాచారం. ఇందులో విజయ్, శ్రీకాంత్, ప్రభు, శరత్ కుమార్… వీళ్లంతా సోదరుల్లా నటించారని టాక్. ఈ బ్రదర్ సెంటిమెంట్ తో రూపొందించిన సీన్లు… జయసుధ, ప్రకాజ్ రాజ్ ఎపిసోడ్లు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయని సమాచారం. శ్రీకాంత్ కి చాలా రోజుల తరవాత మంచి పాత్ర పడిందని చెబుతున్నారు. శ్రీకాంత్ కూడా ‘వారసుడు’ పై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. కాకపోతే… ‘వారసుడు’పై తమిళ సినిమా ముద్ర ఎక్కువగా ఉంది. దీనికి ఎన్ని హంగులు చేసినా, తెలుగు స్టార్స్‌ని ఎంత మందిని దించినా డబ్బింగ్ సినిమాగానే కనిపిస్తోంది. విజయ్ సైతం.. ఇది తమిళ సినిమానే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. కాకపోతే… ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కవుట్ అయితే.. డబ్బింగ్ సినిమానా? స్ట్రయిట్ సినిమానా? అనేది ఆలోచించరు ప్రేక్షకులు. విజయ్ ‘బీస్ట్కి’ తెలుగు నాట మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా ఈసారి సంక్రాంతికి వస్తున్నాడు. ఇవన్నీ వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.