కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేణుగోపాల్, ఆనం రామనారాయణరెడ్డి, వసంత కృష్ణప్రసాద్, ధర్మాన ప్రసాద్ ఇప్పుడు మేకతోటి సుచరిత.. ఇలా వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేల జాబితా పెరిగిపోతోంది. సుచరిత భర్త దయాసాగర్ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారిగా రిటైర్ అయ్యారు. ఆయన వైసీపీలో ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు..ఇక టిక్కెట్ ఇస్తారన్న నమ్మకం లేదు. దీంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఆయన వేరే పార్టీలోకి పోతే తాను కూడా అదే పార్టీలోకి వెళ్తానని సుచరిత నేరుగానే చెబుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో అంతకంతకూ పెరిగిపోతోంది.
ఎమ్మెల్యేలు ఇలా అదే పనిగా పార్టీ , ప్రభుత్వ తీరుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వైఎస్ఆర్సీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరూ జగన్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో లేరని.. కేవలం వారికి వారి నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న రాజకీయ ఆధిపత్య పోరాట పరిస్థితుల కారణంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. కోటంరెడ్డి, ఆనం, వసంత కృష్ణప్రాద్, మద్దిశెట్టి వేణుగోపాల్ , సుచరిత ఇలా.. బయట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నవారికీ టిక్కెట్ గ్యారంటీ లేదని అందుకే.. బయటపడుతున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. వారి అసంతృప్తి పూర్తిగా రాజకీయ కారణాలే కానీ.. జగన్ పని తీరు కారణం కాదంటున్నారు.
పార్టీ అధ్యక్షుడు జగన్ తీరు కూడా వివాదాస్పదంగానే ఉందన్నఆందోళన పార్టీ నేతల్లో ఉంది. ఎంత కష్టపడినా .. ఖర్చు పెట్టుకున్న చివరికి సర్వేల పేరుతో టిక్కెట్ ఎగ్గొట్టి బాగా డబ్బులున్న వారికి ఇస్తారని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు దిగువ స్థాయిలో ప్రజాప్రతినిధులంతా వైసీపీ వాళ్లే. వాళ్ల తీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి అసంతృప్తుల్ని వీలైనంత వరకూ తగ్గించకపోతే.. ముందు ముందు సమస్య అవుతందని వైఎస్ఆర్సీపీ హైకమాండ్‌కు దిగువశ్రేణి నేతలు సలహాలిస్తున్నారు.