2023 సంక్రాంతికి మొదట ఫిక్స్ అయిన సినిమా విజయ్ ‘వారసుడు’. జనవరి 12, 2023 న మా సినిమా రిలీజ్ చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటన చేశారు. నిన్న ట్రైలర్ రిలీజ్ వరకూ వారసుడు రిలీజ్ డేట్ పన్నెండే. అయితే ఈ రోజు సడన్ గా డేట్ మారిపోయింది. ఒక రోజు ముందే అంటే 11న వారసుడు విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. దీనికి కారణం.. అజిత్ తెగింపు. అజిత్ తెగింపుని 11 తేదికి ఫిక్స్ చేశారు నిర్మాత బోనీ కపూర్. దీంతో విజయ్ కూడా అదే డేట్ కి దిగిపోయాడు.
అజిత్, విజయ్ డబ్బింగ్ సినిమాలు పోటాపోటీగా వస్తున్నాయి. అయితే తెలుగులో ప్రమోషన్స్ లో హడావిడి లేదు. నిర్మాతలు కూడా తెలుగుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వాళ్ళ ఫోకస్ అంతా తమిళంపైనే వుంది. అయితే వారసుడు నిర్మాత దిల్ రాజు కావడం, ఆయన చేతిలో చాలా థియేటర్స్ వుండటం.. తెలుగు సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కంటే ఎక్కువ థియేటర్స్ వారసుడికి దొరుకుతున్నాయి. ఇప్పుడు డేట్ ముందుకి జరగడం వలన సంక్రాంతి సినిమాల్లో రెండు డబ్బింగ్ సినిమాలే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లయింది. చేతిలో థియేటర్స్ వున్నాయి.. ఓపెనింగ్స్ కు ఢోకా వుండదని దిల్ రాజు నమ్మకం. అజిత్ తెగింపు విషయానికి వస్తే.. సినిమా బావుంటే ఎంతపోటీ వునప్పటికీ చూస్తారనే విశ్వాసం. మరి తెలుగు బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్న ఈ రెండు డబ్బింగ్ సినిమాల రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి.