సంతోష్ శోభన్, ప్రియ భవానీ జంటగా.. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. దాదాపు కథని ట్రైలర్ లో చెప్పారు. ఇదో నిరుద్యోగి పెళ్లి వేడుక. బేసిగ్గా ఉద్యోగం లేకపోతే పెళ్లి కావడం కష్టం. ఇక్కడ హీరోకి ఆ సమస్య లేదు.
శివ, శ్రుతి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. శ్రుతికి మంచి ఉద్యోగం వుంటుంది. శివ ఇంటిపట్టునే ఉంటాడు. ”నీ భోగమే భోగం రా.. ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామా.. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాలేమైనా ఉన్నాయా..? దెప్పి పొడిచే తండ్రికూడా ఉంటాడు. పెళ్లయిన తర్వాత అంతా సవ్యంగా నడుస్తుందనుకుంటున్న క్రమంలో.. శివకి ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదేమో కానీ శృతి భర్తకు ఉద్యోగం ఉండాలని హీరోయిన్ పాత్ర రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
సంతోష్ శోభన్ టైమింగ్ బావుంది. విజువల్స్ డీసెంట్ గా వున్నాయి. ప్రేమ పెళ్లి చుట్టూ తిరిగే కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయి. ‘కళ్యాణం కమనీయం’ యూత్ ని ద్రుష్టి లో పెట్టుకొని తీసిన సినిమా. నిరుద్యోగం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి.. ఇవన్నీ యువత నిరంతర ఆలోచనలు. ట్రైలర్ ప్రామెసింగా వుంది. పెద్ద సినిమాల మధ్య వస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా వుంటుందో చూడాలి.