ఏపీ అధికార పార్టీ అరచకాలు, పాలనా వైపల్యాలు, ప్రజా సమస్యల గురించి ఎప్పుడైనా బయట ప్రజల్లో చర్చ జరుగుతూ ఉందంటే వెంటనే జేసీబీలను బయటకు తీసి టీడీపీ నేతల ఇళ్లు, వ్యాపారాల మీదకు పంపించడం కామన్ గా మారిపోయింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నల్ల జీవో వ్యవహారంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.. ఉద్యగులు జీతాలు, పెన్షన్లు సగం మందికిపైగా రాలేదు… కుప్పం మహిళలపై హత్యాయత్నం కేసులు పోలీసులే ఫిర్యాదు చేసుకుని పోలీసులే పెట్టారు.. వీటన్నింటిపై చర్చ జరుగుతూండగా.. జేసీబీలను బయటకు తీశారు.
విశాఖలో గీతం మెడికల్ కాలేజీ దగ్గర జేసీబీలను మోహరించారు. ఆ రోడ్డులో ఎవరినీ పోనివ్వడం లేదు. ఏం కూల్చివేస్తారో కానీ.. గీతం యాజమాన్యం మాత్రం … వివాదాల్లో ఉన్న స్థలం కోర్టులో ఉందని.. యథాతథ స్థితి ఉందని.. అక్కడ కూల్చివేసినా.. కంచెలు వేసినా అది కోర్టు ధిక్కరణ అవుతుందని లైట్ తీసుకుంది. ఏం చేసుకుంటో చేసుకోమని చెబుతోంది. అయితే జేసీబీలతో మోహరించి.. కంచెలు తెచ్చిన అధికారులు అక్కడ మీడియాకు ఇంటర్యలు ఇస్తున్నారు.
ఏం చేస్తారో కానీ.. ఇదంతా డైవర్షన్ ప్లాన్ అని అందరికీ అర్థమైపోయింది. గత మూడున్నరేళ్ల నుంచి ప్రభుత్వం తాము చేసే తప్పుడు పనులు ప్రజల్లో ప్రచారం అవుతున్నాయంటే ముందుగా… టీడీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేసి… వాటికే ప్రచారం దక్కేలా చూసుకుంటోంది. ఇప్పుడూ ఇదే పని చేస్తోందని.. లైట్ తీసుకుంటున్నారు. కోర్టులో ఉన్న వ్యవహారంపై అధికారులు ఏం చేసినా వారె ఇరుక్కుపోవడం ఖాయమంటున్నారు.