అతనో యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్. తన బ్యానర్లో మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే.. `యువ` రక్తం కదా..? అప్పుడప్పుడూ హీరోయిన్లపై కూడా మనసు పారేసుకొంటున్నాడు. తాజాగా ఓ హీరోయిన్‌పై మనసు మళ్లింది. అందుకే తనని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో.. అడిగినంత పారితోషికం ఇచ్చి… తన సినిమాలో పెట్టుకొన్నాడు. అంతే కాదు.. ఈమధ్య ఆ హీరోయిన్ తో ఫారెన్ ట్రిప్పు వేశాడట. అక్కడ ఖరీదైన గిఫ్టులు కొని పెట్టాడట. ప్రొడ్యూసర్ చూపిస్తున్న కేర్ కి సదరు హీరోయిన్ ఉబ్బి తబ్బుబ్బైపోతోంది. ఇలాంటి ప్రొడ్యూసర్ తో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నా అని… తెలిసిన వాళ్లకీ తెలియని వాళ్లకు కూడా గొప్పగా చెబుతోంది. ఇది కేర్ కాదు.. క్రష్ అనే సంగతి ఆమెకు కూడా తెలుసు. కానీ… ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తోందట. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా… మరో ఖరీదైన గిఫ్ట్ హీరోయిన్ చేతిలో పెట్టేశాడు నిర్మాత. విషయం ఏమిటంటే… ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. సెట్స్‌పైకి వెళ్లకముందే.. ఇన్నేసి గిఫ్టులు వస్తున్నాయంటే, సినిమా పూర్తయ్యే సరికి.. ఆ గిఫ్టులు ముందు తీసుకొన్న రెమ్యునరేషన్ చిన్నదైపోతుందేమో..? మొత్తానికి ఆ అమ్మడు ప్రొడ్యూసర్ జేబులు ఖాళీ చేయించే మిషన్‌లో బిజీగా ఉందని టాక్.