అప్పట్లో ఏపీ గవర్నర్గా ఉండి.. రాసలీలల వివాదంలో చిక్కుకున్న తివారీ అనే యూపీ రాజకీయ లీడర్ కొడుకునని ఓ వ్యక్తి పోరాడారు. చివరికి డీఎన్ఎ టెస్టులో అది నిజమని తేలింది. తర్వాత అతన్ని కొడుకుగా తివారీ అంగీకరించాడు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఏపీ రాజకీయ నేత కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పేరున్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తే. మేకపాటి కుటుంబానికి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఉత్తినే ఇలా లేఖ రాస్తే ఎవరూ పరిగణనలోకి తీసుకునేవారు కాదేమో కానీ ఆయన తన చిన్న తనంలో చంద్రశేఖర్ రెడ్డి తమ ఫ్యామిలీతో దిగిన ఫోటోలను చూపించారు. ఓ తండ్రిలా నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలను రిలీజ్ చేశారు. తన తల్లి తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిన మహిళలకు కూడా గుర్తింపు ఇచ్చారు కానీ తమకు గుర్తించడం లేదని ఆ యువకుడు అంటున్నారు. ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాలు… మేకపాటి ఫ్యామిలీలో కలకలం రేపుతోంది.
మేకపాటి ఉమనైజర్ అనే పేరు ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. మొదటి భార్య కుటుంబం ఉంది. రెండో భార్య కుటుంబం కూడా ఉంది. ఈ ఇద్దరు భార్యలు తమ వారసుల్ని ఉదయగిరి రాజకీయానికి వారసులుగా నిలపడానికి ఆధిపత్య పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం రెండో భార్య ఉదయగిరి నియోజకవర్గంలో యువరాణిగా చెలామణి అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మధ్యలో నిర్వహించిన బాగోతం వెల్లడి కావడం ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారింది. నిజానికి ఇప్పటికే ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఈ సారి ఇవ్వడం లేదని.. ఆయనను మేకపాటి ఫ్యామిలీ కూడా దూరం పెట్టిందన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది.